వెదురు వేణువు జలపాతం
గంధపు గంధర్వ నది ఆమె!!
భూగోళపు గళం
రక్త చందన అందం ఆమె!!
మూగబోయిన ముల్లోకాలు!!
కాంచనం మోగింది
కంచు చిన్న పోయింది.
రజితం స్వర్ణం
స్వర జీవితం పరాజితమైంది!!?
పచ్చని చిలుక
నల్లని కోయిల
తెల్లని పావురం
గాలి గోపురం పై వాలింది!!!
అడవి వాకిట్లో
నెమలి నాట్యం ఆగింది.!!
ఆకులు రాలినట్లు
చిగురులు తొడిగినట్లు
ఉదయపు మంచు బిందువులు
ఆత్మబంధువుల్లా తొంగి చూస్తున్నవీ!!
వైకుంఠ ద్వారాల్లా
ఆమె స్వరపేటికలు ఎప్పటికీ తెరుచుకునే ఉంటాయి.!!
కిరణాల ఆభరణాలు ఆమె స్వరాలు!!!
ఆమె ఒక శంఖం
ఇక పూరించాల్సింది
శ్రీహరి!!!
ఆమె ఒక మురళి
ఇక శ్వాసను ఊదాల్సింది
శ్రీకృష్ణుడు!!!
ఆమె ఒక గరళ కంఠం
ఇక ఆజ్ఞాపించాల్సింది
ఆ పరమశివుడు!!!
ఆమె ఒక స్వరాభిషేకం
ఆమెకు ఒక అక్షరాభిషేకం!!
ప్రముఖ గాయని కల్పన గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి