డా.ధనాశి ఉషారాణికి ఉత్తమ మహిళగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకల్లో సత్కారం

  తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన వివిధ ప్రక్రియల రూపకర్త కథ రచయిత్రి డా. ధనాశి ఉషారాణి కి చిత్తూరు విజయo విద్య సంస్థ లో ముందస్తు మహిళ దినోత్సవం సందర్బంగా జరిగిన మహిళ దినోత్సవం వేడుకల్లో  ఉత్తమ మహిళగా అనేక సేవా కార్యక్రమాలును నిర్వహించినందుకు అనేక పుస్తకాలు రాసి సమాజంకు మార్గదర్శిగా నిలిచినందుకుగాను అనేక మంది  పెద్దలు ఆత్మీయ అభినoధనలు తెలియజేశారు. ముఖ్య అతిథులకు సోయగము పుస్తకమును ధనాశి ఉషారాణి బహుకరించడము జరిగింది. ముఖ్య అతిధులు డా. రామలక్ష్మిగారు విజయoసంస్థల అకడమిక్ డైరెక్టర్  శైలజ మూర్తి    స్పందన ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్యామల  దేవి కథ రచయిత్రి యo ఆర్ అరుణకుమారి  తుడా చైర్ పర్సన్ కటారి హేమలత చేతులు మీదుగా డా. ధనాశి ఉషారాణి నారి మణి పురస్కారంను సర్టిఫికెట్ ను అందుకున్నారు.
కామెంట్‌లు