మానవత్వం : -డాక్టర్ సీ.వసుంధర.
యాడబోతీవో  రంగి
యాడబోతివో?
తోటకాడ కాపుండి
కూరా నారా! జూడమంటే
కన్ను గప్పి గానరావు
ఎగే దేట్టే నీతో  !యా!

కూడూ కూరాకు జేసి
సూరిడు ఒంగకుండా
నడినెత్తిన ఉన్నప్పుడే
వడిగా రాయే అంటే నువ్వు
పత్తాలేవు వత్తాననవు.!యా!

పట్టం మావోచ్చిండు
అన్నం ఒండి కూరలొండి
పరమాణ్ణం. గాయమంటే
అంతూ పొంతూ లేవు
ఎట్టాఎగేది నీ తో .
!యా!
👩‍🦱👧👩‍🦱👧💁
చూడుమావ బంగారి మావ
పక్కింటి జానకవ్వ
సుస్తీ జేసి మంచమెక్కే
గుక్కెడు నీళ్లిచ్చే
దిక్కులేదు మొక్కులేదు.
మనం మనసులంగదా మావ!
ఇరుకు సొరుకు అయినప్పుడు
ఇరుగుపొరుగు మనం
ఒకరికొకరు సాయంగా ఉండండని అయ్యోరు
సెప్పెగదా.
ఇంటే సరిపోదు మావ
కంటికి గనపడ్డప్పుడు
కుంటిసాకులు సెప్పకుండా
కట్టంవొచ్చినోళ్ళను
కనిపెట్టి ఉండాలగదా
జానకవ్వ పడుకోంది.
చిటికలోన   నేవస్తా.
చేస్తా జూడు నాసామిరంగా!
పట్టం మావ పట్టుబట్టి
పొట్టనిండా తినేటట్టు వంటలన్ని
ఘంటసాల పాటల్లాగరుచి రుచిగా ఉంటాయి పట్టమావకు
పొట్టనిందా వండి పెడతా
🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు