నాన్నమ్మ సూక్తులు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
సున్నితమైన మనసులు
చేయకూడదు ముక్కలు
బాకులాంటి మాటలతో
విపరీతపు చేష్టలతో

దేవుని సృష్టి సర్వము
చేయరాదోయ్! నాశనము
చేతనైతే అందరికి
అందించాలోయ్! సాయము

చూడాలోయ్! అందరిలో
దేవ దేవుని రూపము
వీడాలోయ్ మనసుల్లో
 ఉన్న చెత్తాచెదారము

శృతిమించితే గర్వము
కట్టలు తెగిన కోపము
చేయును అల్లకల్లోలము
మసి బారునోయ్! జీవితము


కామెంట్‌లు