ఉపాధ్యాయుల అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలి.

 14 మంది ఉపాధ్యాయుల అక్రమ సస్పెన్షన్లను రద్దు చేయాలని, జిల్లా విద్యా శాఖాధికారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కొత్తూరు మండల ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. జిల్లా సమాఖ్య పిలుపుమేరకు కొత్తూరు మండలంలో గల ప్రాధమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బోడ శ్రీను మాట్లాడుతూ ఉపాధ్యాయుల అక్రమ సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయాలని, జిల్లా విద్యాశాఖ అధికారి నిరంకుశ వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. సమస్యపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి ఉపాధ్యాయులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కామెంట్‌లు