ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రముఖ రచయిత్రి డా. ధనాశి ఉషారాణి

  తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి  డా. ధనాశి ఉషారాణి చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తిస్తూ ఇండియన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ లో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ప్రో. దిశాంతు బజాజ్ మరియు డా. యం పవన్ కళ్యాణ్ అబ్బాస్ మేహిద్ నేషనల్ ప్రమోటర్     నియామక పత్రం అందజేశారు.ఇది వరకే నేషనల్ ఉమెన్స్ వింగ్స్ లో వైస్ చైర్మన్ గా చైల్డ్ లేబర్ గురించి సేవా కార్యక్రయాలకు కృషి చేశారు. సామాజిక న్యాయ పరమైన మహిళా సాధికారత లక్షముగా పని చేస్తానని డా. ధనాశి ఉషారాణి తెలియజేసారు.
కామెంట్‌లు