నాదారిలో
నడుస్తున్నా
ఆగకుండా
ముందుకెళుతున్నా
నాబాటలో
పయనిస్తున్నా
అనుభూతులను
వ్యక్తపరుస్తున్నా
నామార్గంలో
అడుగులేస్తున్నా
తెల్లారితేజస్సులను
వెన్నెలవెలుగులనువెదజల్లుతున్నా
నాపథంలో
సంచరిస్తున్నా
ఆలోచనలుపారిస్తున్నా
అక్షరరూపమిస్తున్నా
నాతెరువులో
అన్వేషిస్తున్నా
తీరైనభావాలను
సరైనరీతిలోకలబోస్తున్నా
నానరవలో
విహరిస్తున్నా
పసందైనపదాలతో
పలుకరించుతున్నా
నాత్రోవలో
వెదుకుతున్నా
జ్యోతులువెలిగించి
జగతినిచైతన్యపరుస్తున్నా
నాజాడలో
శ్రమిస్తున్నా
అందమైన అభరణాలనుచేసి
అమ్మవాణీదేవిమేదలో వేయాలనిచూస్తున్నా
నాదోవలో
పనిజేస్తున్నా
ముళ్ళనుతీసేసి
పూలనుచల్లుతున్నా
నాగతిలో
నూతనత్వంచాటాలనుకుంటున్నా
అంతరంగాలను
ఆకట్టుకోవాలనుకుంటున్నా
నాసరణిని
వదలకూడదనుకుంటున్నా
నాపనిని
వీడకూడదనుకుంటున్నా
నాసడవని
అంటుకొని ఉంటా
నాదృష్టిని
అంతంవరకు సాగిస్తుంటా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి