మొదలు, తుది తెలియని జడల మారయ్య మర్రిమాను కడప జిల్లా మండలంలో చింతల చిలకల గ్రామంలో ఉంది. దాదాపు రెండు ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ చెట్టు కిందకు వెళితే అంతా చీకటిగా ఉంటుంది. వర్షం పడక కరువు వస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడకు వచ్చి మొక్కుకుని తిరిగి ఇంటికి వెళ్లే లోపే వర్షం పడి పూర్తిగా తడిచేవారని గతకాలపు కథ.
ఇంత విశిష్టత కలిగిన ఈ చెట్టు దాదాపు 300 సంవత్సరాల వయసు ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ఈ చెట్టు మీద వేల సంఖ్యలో ఒకే రకం పక్షులు ఉంటాయి. వీటిని కబోదీపక్షులని పిలుస్తుంటారు. ఈ పక్షులు గబ్బిలాల మాదిరిగానే ఉంటాయి. ఒక్కొక్క పక్షి సుమారు మూడు కేజీల బరువు కలిగి ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. ఈ చెట్టుపై వాలే పక్షులు ఏ ప్రాంతానికి చెందినవి అని మాత్రం తెలియకపోయినా ఆ జాతి పక్షుల్ని గుర్తించాల్సి ఉంది.
జడల మారయ్య మర్రిమాను: - తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి