తెలుగు భాష పాట:- పి.వర్షిణి-జి .ప.ఉ.పా రామంచ-మం.చిన్నకోడూరు-జి .సిద్దపేట

 తెలుగు భాష కన్నరా
తియ్యనైంది లేదురా
తెలుగు భాష మించిన
వెలుగు ఎక్కడుందిరా
విరభూసిన పవ్వులా
వెలుగుతుంది తెలుగురా
తియ్యనైన భాషరా
తెనెలొలుకు భాషరా
పసందైన భాషరా 
మన మాతృ భాషరా
మరవకురా సోదరా
మన తెలుగు భాషరా
మాతృభాష వింటెరా 
మనసు మురిసి పోవురా
రామచిలక రాగాల
మాతెలుగు భాషరా
కొకిలమ్మ కూతరా
మా మాతృ భాషరా
పసిపిల్లల పలుకురా
మా తెలుగు భాషరా
"తెలుగు"

కామెంట్‌లు