తల్లిదండ్రుల హితవు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
మితిమీరితే తప్పులు
అమితమైన అప్పులు
ఎప్పటికైనా ముప్పు
తగలబెట్టే నిప్పులు

విస్తారమైన మాటలు
మచ్చ తెచ్చే చేతలు
మిక్కిలి ప్రమాదకరము
అదుపు తప్పిన తలపులు

నీటి మీద రాతలు
నిస్సారపు జలములు
శోధింపగ లోకాన
నిలకడ లేని మనుషులు

గురువులు లేని చదువులు
చమురు లేని ప్రమిదలు
అంతంత మాత్రమేనోయ్!
అభివృద్ధి లేని బ్రతుకులు


కామెంట్‌లు