దొరకునా ఇటువంటి పాట :- Dr. C వసుంధర- చెన్నై
పాత పాటల్లో పండింది ప్రకృతి, అందుకే  నిండింది అందరి గుండెల్లో ఆ కృతి.

అది ఆ తరం చేసుకొన్న సుకృతీ,
మరిచిపోలేము ఏ కృతి మధుర భావాల పూర్ణాకృతులవి.
  
పదాల వెనుక పరిగెడుతుంది భావం.
రస భావాల సమ్మేళనంలో రూపు దాల్చుకొంటుంది 
శిల్పం. అందుకే రసజ్ఞుల హృదయం పులకరిస్తుంది పూజలందిస్తుంది. అందుకే ఆ అద్భుత గత కాల గీత సుందరికి  వందనం.అభివందనం

పూవులకు తావి
అబ్బినట్లు సొగసుగా మృదంగ తాళముల సహకారం. సంగీతమా అది కాదు సామ వేద సారం.
గీత వాద్యాల సమ్మేళనంతో
సంగీత సాగరం నుండి 
 పుట్టింది  అమృత బాండంలా గాన గాంధర్వ శిఖామణులు 
ఘంటసాల, సుబ్రహ్మణ్య నామధేయాది ప్రభృతులు గళా లనుండి  గతకాలపు  గీతాభిషేకం.
వర్షించారు  వారు ఎన్ని వర్షాలైనా వాడిపోని వాసన వీడి పోని గాన పుష్పవర్షాభిషేకమది. వాటిని అందిస్తుంది మనకిప్పుడు స్వరాభిషేకం, మన కర్ణాలకది నిరంతర ఆనందామృతాభిషేకం.
వినమృతాంజలులివే స్వరాభిషేకం కల్పనా కర్తలకు, కార్యవర్గదీ క్షాపరులకు వందనం పాదాభివందనం. బుధజన విధేయురాలు.
C వసుంధర🍄
💐💐💐💐

కామెంట్‌లు