బాలల కథల పోటీ -2025లో భూక్యా వర్షితకు ద్వితీయ బహుమతి

 మాచిరాజు బాల సాహిత్య పీఠం వారు  ఎంతో ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన 
 బాలల కథల పోటీ -2025లో    భద్రాద్రి కొత్త గూడెం జిల్లా జూలూరుపాడు మండలం ZPHS పాపకొల్లులో  7వతరగతి చదువుతున్న భూక్యా వర్షితకు ద్వితీయ బహుమతి లభించింది.
జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీకి వచ్చిన 541  కథల్లో  భూక్యా వర్షిత రాసిన "జంక్ ఫుడ్ తింటే..." కథ
ద్వితీయ స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పేరు మారు మ్రోగేలా చేసింది. 
 తల్లిదండ్రులు విజయ,హతీరాంలు, గ్రామస్థులు, పెద్దలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీరా సాహెబ్ ను మరియు ఉపాధ్యాయ బృందాన్ని, ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయిని వురిమళ్ల సునంద ను ప్రశంసించారు

కామెంట్‌లు