సర్వాత్మకం :-ఎ.రాజ్యశ్రీ 8985035283
రాముడుద్భవించె
జగతి పులకించె సీతారాముల కల్యాణంతో 
జగమంతా సర్వాత్మకం 
రామునిలోని రమ్యత్వం
సద్గుణం ఒకేమాట ఒకేపత్ని 
మాటతప్పని పౌరుషత్వం 
ధీరత్వం శాంత గంభీరం
ప్రజాక్షేమంతో రామరాజ్యం 

సీతలోని సతీత్వం సౌశీల్యం
పతి బాటలో అడుగులు
పతివ్రతాదీక్షలో ఆత్మాభిమానంతో
లోకక్షేమంకై అయోనిజ సీత 
ఆదర్శ జంట  కన్నుల పంట
కలకాలం ఉండు మనవెంట

...స్వస్తి...

కామెంట్‌లు