ఎండలు బాబోయ్ ఎండలు
ఎక్కువ తిరగొద్దు మనమండోయ్
భగభగ మంటూ ఎండలు
నిప్పుల వాన కురిపిస్తున్నవి
ఉక్కపోతతో జనమంతా
ఉక్కిరి బిక్కిరి అవుతుండ్రు
భానుడి వేడికి భూమంతా
అగ్ని గుండమై మంతుంది
తరువులు చెరువులు
పక్షులు పశువులు
దాహం దాహం అంటున్నయ్
మనిషి స్వార్థం పెచ్చు పెరుగెను
పర్యావరణం తగ్గిపోయెను
పెరిగిన ఎండలు ఉక్క పోతగ
తలపిస్తున్నయ్
బయటకు అసలే పోవద్దు
భద్రంగా మనం ఉండాలె!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి