అగ్గితోనే నూతనావిష్కరణలెన్నెన్నో:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
అగ్గిపుల్లలేగదా అని 
తక్కువగా అంచనా వేయకు

ఒక్క అగ్గిపుల్ల చాలు
దట్టమైన అడవిని దగ్ధం చేయడానికి

ఆదిమానవుడి పరిణామక్రమంలో నిప్పు పుట్టించడమే 
అత్యంత కీలకం ఘట్టం

 ఆతర్వాతే నూతనావిష్కరణలేనెన్నో జరిగాయి

 విలువైన ముడిపదార్ధాలను భూమినుండి సంగ్రహించిన మనిషి యినుము, బంగారం,వెండి,రాగి ,ఇత్తడి, సీమవెండి ,మొదలకు రూపంలో అగ్ని తాపడంతోనే కదా వేరుచేయగలిగింది 

అగ్గికి ఆజ్యం పోస్తే అగ్నిహోత్రం అవుతుంది.
లోకకళ్యాణానికి హోమం శ్రేయోదాయకమేకదా!?

అగ్ని ప్రమిదలో చేరితే
కాంతులీనుతుంది

చీకటిని పటాపంచలు చేసి జగాలను తేజోమయంచేస్తుంది

దీపం జ్యోతి పరబ్రహ్మ 
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే 
అన్నారు కదా

అగ్గి మన వాడకాన్నిబట్టి వంటవుతుంది
మోతాదు హెచ్చితే
 ఆ వంట అక్కరకురానిదవుతుంది

ఆడపిల్లలు అగ్గిపుల్లల తీరుగా
నివురు గప్పినట్లు ఉండాలి
ఆపదసమయాలలో అగ్గిపుల్లలై మండాలి
ఆకతాయిలపై విరుచుకుపడాలి

ఆడపిల్లలు అబలలుకాదు
అగ్గిబరాటలని రుజువు చేయాలి

అగ్గిలేనిదెక్కడ?! మన ఉదరంలో జఠరాగ్ని
ఆహారముంటే ఆహారాన్ని దహించివేస్తుంది

లేకుంటే అ

గ్ని ఉదరోష్ణమును పెంచేస్తుంది

మానవ మనుగడకు అగ్ని సంస్కారం
అత్యంత ముఖ్యము
కానీ
అగ్గితో ఆటలాడొద్దు ఆహుతై పోతారు
తస్మాత్ జాగ్రత్త
నిప్పుతో చెలగాటం అంతమంచిది కాదు

కామెంట్‌లు