ఆరోగ్యమే మహాభాగ్యము:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
 ఆహారమే ఔషధం
సుఖనిద్రే ఆరోగ్యరహస్యం
ఖాళీకడుపు జఠరరసోత్పత్తికి
హేతువు
మితాహారం సర్వ శ్రేష్టం 
అతి సర్వత్ర వర్జయేత్
ఉదయం ఎనిమిది గంటలలోపు
అల్పాహారం మేథో వికాసానికిదోహదపడుతుంది
జ్ఞానోద్దీపనకు ఆలంబనమది
మొలకలు, డ్రైఫ్రూట్స్ ,పేదవాడి బాదాం పప్పు (వేరుశనగలు)
ఇవి సూక్ష్మ స్థూల పోషకాలకు నిలయాలు
ఏకభోక్తంయోగి
ద్విభోక్తంరోగి
అందుకే మితం శ్రేయస్కరం
అతిఅనర్థదాయకం
యువత చదువులపేర పట్నవాసం పిజ్జా ,బర్గర్ ,దిల్కుష్ ,దిల్పసంద్ కూల్ కేక్ లు కూల్ డ్రింక్స్ 
ఫాస్ట్ ఫుడ్ అనారోగ్యానికి కారణం
వీటికి బదులుగా కోకోనట్ వాటర్ లెమన్ జ్యూస్ పళ్ళరసాలు శ్రేయోదాయకం 
పప్పు బియ్యం( కిచిడి)
పోషకాలసమాహారం
ఆకుకూరలు కాయగూరలు
ఐరన్ రిచ్ ఫుడ్స్ఇవే మన ఫ్రైడ్ ఫుడ్స్ అన్నది మరువొద్దు
 అతిగా మాంసం మద్యం సేవిస్తే
ఇటుకాలేయంచెడి
అటుక్రోవ్వుపెరిగి బీపీ షుగర్ హృద్రోగంవంటి రోగాలకు ఆహ్వానం
పలికినట్టే
ఆరోగ్యంమే మహాభాగ్యం
అన్నారు కానీ
భాగ్యమే ఆరోగ్యం అనలేదుకదా
ఆరోగ్యం చెడిన తర్వాత 
డబ్బు ఖర్చు పెట్టేకంటే
రోగం రాకుండా చూసుకోవడం
సర్వులకు శుభప్రదం
తిన్నతర్వాత పడుకోకుండా
వందడుగులు నడవడం వల్ల 
జీర్ణక్రియమెరుగుపడుతుంది
పూటకూళ్ళపెద్దమ్మ ఇంటికెళ్ళడం(ఫైవ్ స్టార్ హోటల్) వీకెండ్ స్పెషల్ పార్టీలపేర అతిగా ఆహారం తీసుకోవడం అంతమంచిదికాదు
మన పూర్వీకుల ఆహారపు అలవాట్లు (ముడి ఆహారము- Raw food) తీసుకోవడం) అలవాటుచేసుకుందాం
నిత్యంయోగ ధ్యానం మన జీవితంలో
ఒక భాగం చేసుకుందాం
నిత్యం ఆరోగ్య నియమాలు
పాటిస్తూ బ్రతికినంత కాలం
మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ బారినపడకుండా చూసుకుందాం
ఈ లోకంలో ఎవడు అదృష్టవంతుడంటే
రాత్రి తిన్నది శుభ్రంగా జీర్ణమై
ప్రొద్దుటిపూట ఆకలివేయగా
భుక్తాయాసంలేకుండా తిని 
తన శరీరాన్ని తేలికగా ఉంచుకొని చలాకి తనంతో
ఉండేవాడే అదృష్టవంతుడు 
అందుకే బజార్లో కంటికేది నచ్చితే అది తినకూడదు
అది స్వయంపాకం కాదుకదా
హోటల్ యజమాని వ్యాపారమే చేస్తాడు
నీ( మీ)ఆరోగ్యం పట్ల అతడుశ్రద్ధ వహించడు కదా
ఈ భూప్రపంచంలో ఆరోగ్యసంపదను మంచిన గొప్పదిమరొకటిలేదు


కామెంట్‌లు