సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు
సంఘసేవకుడు సన్మార్గమూర్తియైన
మహాత్మా జ్యోతిబాపూలే
శ్రీమతి చిమునాబాయి శ్రీ గోవిందరావు
పుణ్యదంపతులకు
పద్దెనిమిది వందల ఇరవై ఏడు
ఏప్రిల్ పదకొండున
మహారాష్ట్రలోని సతారా జిల్లానందు
మాలి కులంలో జన్మించెను
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా
చిన్నప్పటినుండి సామాజిక భావాలను వ్యక్తం చేసెను
పండ్లు కూరగాయలు పూలు అమ్ముకునే
కుటుంబంలో జన్మించినప్పటికీ
సమాజంకు పరిమళంలు వెదజల్లెను
చదువు తక్కువైన పుస్తక పఠనం ఎక్కువే
గొప్పవారి జీవిత చరిత్రలెన్నో చదివి
వాటినాచరించి మంచిపనులు చేసి మహానీయుడవైతివి
పదమూడేళ్ళ వయస్సులోనే
తొమ్మిదేళ్ళ సావిత్రమ్మను
పరిణయంబాడి
చదువురాని సావిత్రమ్మకు చదువు నేర్పించి
పట్టుబట్టి ప్రథమ మహిళా గురువుగా
సావిత్రమ్మను తీర్చి దిద్దెను
ప్రపంచానికి పరిచయం చేసి
శాశ్వత కీర్తిని సంపాదించెను
జ్ఞానసంపద ఎవరిసోత్తు కాదని
బ్రాహ్మణ ఆధిపత్యాన్ని విమర్శించెను
గులాంగిరి లో బానిసత్వంను
గూర్చి
తులనాత్మకంగా పరిశీలించి చూపెను
సత్య శోధక్ సమాజం స్థాపించి
ధీనబందు వారపత్రికను ఏర్పాటు చేసి
అందరికి ఆపద్భందవుడ వయ్యెను
సమాజంలో ప్రతి సమస్యను
గుర్తించి పోరాటం చేసెను
దేశమనే దేహానికి శూద్రులు ప్రాణమనెను
అంబేద్కర్ జ్యోతిబాపూలేను
గురువుగా బావించెను
జీవిత చరమాంకం వరకు
సమస్యలపై పోరాడిన
మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే
( జ్యోతిబాపూలే జయంతి ఏప్రిల్ 11 సందర్బంగా రాసిన కవిత )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి