వృద్దాశ్రమాల్లో వృద్ధులు : - భైరగోని రామచంద్రము-స్కూల్ అసిస్టెంట్, తెలుగు -హైదరాబాద్, -చరవాణి :9848518597
ఆప్యాయతకు అనాధరణకు 
నోచుకోని వృద్ధులెందరో?
వృద్దాశ్రమాల్లోని వృద్ధులందరు 
ఆకాశంలో ఎగురుతున్న పక్షులు సైతం 
ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుకుంటాయి 
ఈ మానవ వృద్ధపక్షులు మాత్రం 
వృద్దాశ్రమ గూటికి చేరుకున్నాయి 
ఎందుకో మరీ!

కడుపారా కని పెంచిన కనికరం 
లేకుండా కన్నోళ్లను 
ఎటుకానోళ్లను చేస్తున్నరు
ఇందుకే మరీ!
వృద్ధులు వృద్దాశ్రమాలకు 
చేరువవుతున్నరు.
కండ్లకు చీకటచ్చి వీళ్లకు కన్నోళ్లు కనిపించడం లేదు 
వెనకో ముందో వీళ్లకు (తల్లిదండ్రులను అనాధలను చేసిన వాళ్లకు ) 
అదే గతి రాక తప్పదు.

కొందరు వృద్దులైతే 
కొడుకులు కొడండ్ల బాధలు 
తట్టుకోలేక వృద్దాశ్రమాలకు 
చేరువవుతున్నరు.
పాపం వృద్ధదంపతులకు 
మనుమలు మనుమరాండ్లను 
కొడుకు కొడండ్లను 
ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక 
ఎక్కడో ఒక్కచోట కాలమెళ్ళ 
దీయడమే శరణ్యమని 
వృద్దాశ్రమాలకు చేరుతున్నరు 


( ప్రస్తుతం వృద్ధుల పరిస్థితి ఇది )


కామెంట్‌లు