సుప్రభాత కవిత : - బృంద
చీకటికి ముగింపు 
రేపటికి పొడిగింపు 
పొడిచే పొద్దు పలకరింపు 
పుడమికి పెద్ద పులకరింపు!

ఏటికి జలదరింపు 
తోటకు పరిమళింపు 
పాటకు పల్లవింపు
మాటల మేళవింపు!

అసమాన బాలుని
ఆగమన వేళ తోచే
అపురూప వర్ణాలు
అద్వితీయ సొయగాలు!

అవ్యక్త ఆనందాన్నిచ్చే
అనుభూతుల గనులు
ఆస్వాదించే అంతరంగాలను
ఆహ్వానించే అరుణోదయ అందాలు!

మనకోసం నియమంగా 
అనుదినమూ తరలివచ్చి
హితమోనరించు దినకరుని
సువర్ణమయ శుభరూపము!

ప్రకృతి మొత్తం పరవశించి 
పాడుతున్న ఉదయగీతిక 
ప్రభాకరుని రాకకై వేచిన 
ప్రపంచపు స్వాగత గీతిక!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు