మాంసాహారం మొక్కలు. :- తాటి కోల పద్మావతి.

 మంచి ఆహారం తీసుకొని వాళ్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళక తప్పదు. మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూరలను, పండ్లను తినడం వలన ఎలాంటి జబ్బులు రావని అందరూ నమ్ముతున్నారు. అందుకే మాంసాహారాన్ని వదిలి శాఖాహారులుగా మారుతున్న చాలామందిని చూస్తున్నాం. 
అయితే శాకాహారాలు అనుకుంటున్నా మొక్కలు మాంసాహారులుగా మారితే...... అమ్మో ఇంకేమైనా ఉందా! అయితే అలాంటి ఒక మాంసాహారం మొక్క గురించి సాన్ ఫ్రాన్సిస్కో శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. 
అందర్నీ ఆశ్చర్య చెకితుల్ని చేస్తున్న మాంసాహారం మొక్క పేరే: బ్లాడర్ ఓట్స్'ఇలాంటి మొక్కలను పరిరక్షించాలని ఉద్దేశంతో ఫ్యాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 
మాంసాహారి మొక్క చిన్న చిన్న కొలనులో చెరువులలో కనిపిస్తుంది. చూడటానికి అందంగా కనిపిస్తూ క్రిమి కీటకాలను ఆకర్షిస్తుంది. ఆ మొక్కపై ఏవైనా కీటకాలు వాలగానే ప్రాణాలు పై ఆశ వదులుకోవాల్సిందే. 
వాటిని చంపే విధానాన్ని చూస్తే అమ్మో ఎంత తెలివిగా చంపుతుంది అని ఆశ్చర్య పడని వారంటూ ఉండరు. రెండు చెప్పల్లాగా తెరుచుకొని కనిపిస్తున్న పత్రాలు ఈ మొక్కకు ఆయుధాలు. కీటకం ఈ చిప్పల మధ్యకు పోగానే రెండు చిప్పలు మూసుకుపోతాయి. అందులో చిక్కుకున్న కీటకాన్ని ఆ రెండు చిప్పలు పీల్చి పిప్పి చేస్తాయి. ఈ మొక్కలు కీటకాలతో పాటు చిన్న బల్లులను కూడా తింటాయి. కాబట్టి ఈ మాంసాహారం మొక్కను ఇళ్లల్లో కూడా పెంచుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఈగలు దోమల వంటి క్రిమి కీటకాలతో పాటు బల్లులను తింటున్న ఈ మొక్క మనకు మేలు చేస్తుందంటున్నారు అక్కడి శాస్త్రజ్ఞులు. 

కామెంట్‌లు