కళా హృదయం..! - కోరాడ నరసింహా రావు
ఇవి రంగు,రంగులతో కాంతు లీను బుట్ట బొమ్మలు...! 
 
మృత్తికను అందమైన బొమ్మలుగా మలచగల సామర్ధ్యము వారిది..!! 

సిల యైన, మృత్తి కైన, సై కతమైన... 
  సుద్ద ముక్కయిన,కొయ్యె యైన...పదార్ధమది యేదైనా...  

ఎందుకూ పనికి రావని పారేసిన వ్యర్ధ పదార్ధాలకు
 అద్భుతంగా  అందమైన రూపాన్ని ఇవ్వగల...కళకు వందనం ! 

కళ లంటే... కేవలము 
నైపుణ్య ప్రదర్శనతో... 
  వారి ప్రతిభను చాటుకునే వేనా....! 

జీవనో పాదికి చేతి వృత్తులు చేసుకునే... 
కుమ్మరి, కమ్మరి, మేదరి, వంటివారు  ఎంత అద్భుత మైన ప్రతిభను కనపరుస్తు న్నారు...! 

వీరంతా మట్టిలో మాణిక్యాల వంటి వారు! 
 ప్రోత్సాహమనే సాన పడితే వజ్రాల్లా మెరిసిపో గజరు...!! 

హృదయాన్ని రంజింప జేయ గలిగేది! 
  అది ఎవరి వద్ద ఉన్నా... 
 అభినంద నీయమే...!! 

రహదారి  రోడ్డు ప్రక్క.... 
రంగు సుద్ద ముక్కలతో... 
  ఎంత అద్భుతమైన చిత్రా లను వేస్తాడా చిత్ర కారుడు ! 

పికాసో, రవివర్మ లాంటి వారిని ఆకాశాని కెత్తే సిన హృదయాలు కనీసం ఇ లాంటివారిని పట్టించుకోక పోవటం బాధాకరమే కదా ! 

చేతి వృత్తే జీవనో పాదిగా బ్రతుకుతున్న ఇలాంటి వా రిని అభినందించి, ప్రోత్స హించ గలిగెదే... 
 నిజమైన కళాహృదయం !
     *****

కామెంట్‌లు