నల్ల చిరుత:- - యామిజాల జగదీశ్

 ఆఫ్రికా దేశం కెన్యాలోని శాన్‌డీగో జులో అమర్చిన సీక్రెట్‌ కెమెరాలకు నల్ల చిరుత చిక్కిది. దాదాపు వందేళ్ల తరువాత ఈ నల్ల చిరుత కనిపించింది. ఈ కెమెరా అందించిన ఫొటోలతో బ్లాక్ పాంథర్ ఉందని అటు శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు.
లోసయిబా వైల్డ్‌లైఫ్ కన్జర్వేటరీలో కొన్నాళ్లుగా పలువురు పరిశోధకులు చిరుతలపై అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా పలు చోట్ల కెమెరాలు అమర్చగా వాటికి ఈ నల్ల చిరుత చిక్కింది. బ్లాక్ పాంథర్స్‌ గా పిలిచే ఈ అత్యంత అరుదైన చిరుత కనిపించడం తమకు చాలా ఉత్సాహంగా అనిపించిందని కన్జర్వెన్సీ వెబ్‌సైట్ చెప్పింది. వీటినే మెలానిస్టిక్ లెపర్డ్స్‌ గా కూడా పిలుస్తారు. మెలానిజం అనేది ఓ జన్యుపరమైన ఉత్పరివర్తనం. శరీరంలో అధికంగా మెలానిన్ ఉత్పత్తి కావడం వల్ల శరీర కణజాలం నల్లబడుతుంది. అది కాస్తా చర్మం నల్లగా మారడానికి కారణమవుతుంది. ఈ తాజా పరిశోధనతో ఆఫ్రికాలో నల్ల చిరుత ఉందని గత వందేళ్లలో తొలిసారి శాస్త్రీయ నిరూపణ జరిగింది.

కామెంట్‌లు