తెలుగు-తెలుగు:- తెలుగు-తెలుగు:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
తెలివిరాని తెలుగునేల తెలుగును వెళ్ళగొట్టుతున్నది.
మార్కుల మాయాజాలంలో అస్తిత్వాన్నే వదులుకుంటున్నది.
అమ్మభాష కమ్మదనమే గాక,
భావవినిమయ భావజాలాన్ని ఇంటినుండే వెలివేస్తున్నది.
సామెతల,జాతీయాల సంపదను విచ్చలవిడిగా ఉపసంహరించుకుంటున్నది.
మాటలాడేందుకు కూడా పనికిరాదని అపహాస్యం చేస్తున్నది.
మోజులో మోసపోయి పూర్తిగా మూర్ఛపోబోతున్నది.
మందులేని మాయరోగమల్లే
తన చితి తానే పేర్చుకుంటున్నది.
రగిలే జ్వాలలా నిత్యం దహనమవుతున్నది.
వ్యాఖ్యాతల,సంపాదకీయుల,విలేఖరుల చేతుల్లో సమాధి కట్టబడుతున్నది.
"తెలుగు రాదా"యని అడిగే స్థితి అవలీలగా తెచ్చుకుంటున్నది.
సంస్కృతి నుండి విడిపోయి,
ఎడారిగా మిగిలే ప్రమాదమున్నది.
ఏదో ఒక మాధ్యమంగా చిరునామా కలిగి ఉండాలి.
మసకబారిన మనసుల దోచుకోవాలి.
కన్నీళ్ళే పన్నీరై చిలకరించే సమయం రావాల్సి ఉన్నది.
తెలుగు వారందరూ హృదయంతో ఆలోచించాల్సిన
పరిస్థితి దాపురించింది.
మాతృభాష మనుగడకు మళ్ళీ ఉద్యమాలు చేయాలా?
ఉదాసీనత,నిర్లక్ష్యాలతో నిన్ను నీవు కోల్పోవాలా?
గిజిగాని గూడులాగా పొందికగా నిలబెట్టాలి.
తెగేసి చెప్పకపోతే చరిత్ర హీనమై పోతుంది.
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,సికింద్రాబాద్.

కామెంట్‌లు