శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లోకం: 
బాల్యాద్విష్యపి  జాగదాదిషు  తథా సర్వాస్వవస్థా స్వపి 
వ్యావృత్తా స్వను వర్తమానమహమిత్యంతః
స్పురంతం సదా
స్వాత్మానం ప్రకటీ కరోతి భజతాం యో ముద్రయా భద్రయా     
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్త యే !!

భావం: ఎవరి ఉనికి అయితే బుద్ధి యొక్క వివిధ అవస్థల( దేహమునకు బాల్యం యవ్వనం వృద్ధాప్యం బుద్ధికి జాగ్రత్త చేతన సుషుప్తా, మొదలగునవి ) వచ్చే మార్పులకు అవలీలగా ఉండునో, జ్ఞానముద్ర (అభయ హస్తమున బొటనవేలు చూపుడువేలు కలిపిన ముద్రను జ్ఞానముద్ర అంటారు) ద్వారా ఆత్మజ్ఞానమును కలుగజేసే గురుస్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు. 
                    ****

కామెంట్‌లు