వృత్రాసురుడి పూర్వజన్మ :- అచ్యుతుని రాజ్యశ్రీ

 చిత్రకేతుడు అనే రాజుకి సంతానం లేదు అంగీరస ఋషి పుత్ర కామేష్టి చేయించాడు ఆయన భార్య కృతద్యుతికి  ఒక కొడుకు పుట్టాడు.కొడుకువల్ల సుఖదుఃఖాలు కల్గుతాయని ఋషి ముందే చెప్పాడు.పెద్ద భార్యకు కొడుకు పుట్టడంతో భర్త తమను నిరాదరిస్తున్నాడని  రాజు ఇతర భార్యలు ఆపిల్లాడికి విషాహారం తినిపిస్తారు. ఆశిశువు నల్లగా మారి చనిపోతాడు అప్పుడు రాజు చిత్రకేతుడు విపరీతంగా బాధపడి ఏడుస్తాడు అతన్ని ఓదార్చటానికి రుషి నారదనితో కలిసి వస్తాడు నారదుడు చనిపోయిన పిల్లాడి జీవుడిని పిలుస్తాడు ఆ జీవుడు ఇలా అంటాడు నేను ఎన్నో జన్మలలో ఎంతోమంది అమ్మానాన్నలను పొందాను నేను ఈ శరీరంలో ఉండదు నాకు ఈ రాజు అతని భార్య అమ్మానాన్నలు కాదు వీరితో నాకు పెట్టి సంబంధం లేదు. ఈ మాటలు విన్నా రాజదంపతులకు వైరాగ్యం కలిగింది ఈ బంధాలు అనుబంధాలు శాశ్వతం కాదు అని తెలుసుకుంటారు రాజుకి ఋషి మంత్రోపదేశం చేస్తాడు ఏడు పగళ్ళు 7 రాత్రులు ఆయన జపం చేస్తే ఆదిశేషు దర్శనం ఇచ్చాడు సంఘర్షణ దర్శనం అవుతుంది ఇప్పుడు చిత్రకేతుడు కైలాసానికి వెళ్ళాడు అక్కడ శివుని తొడపైన పార్వతీదేవి కూర్చుని ఉంటుంది అహంకారంతో చిత్రకేతుడు వారిని చూసి పకపకా నవ్వాడు పార్వతి అడిగింది ఎందుకు నవ్వావు దానికి రాజు ఇలా అన్నాడు ఇంతమంది ఉన్న సభలో మీ ఇద్దరూ ఆలుమగలు ఇంత సన్నిహితంగా కూర్చోవటం భావ్యమా? 
అమ్మ వారికి కోపం వచ్చిఅంది"జగతికి తల్లిదండ్రులమైన మమ్మల్ని ఇంత చులకన చేసి మాట్లాడిన నీవు,ప్రకృతి పురుషులని అవమానించిన నీవు రాక్షసునిగా పుట్టు" అని శపించింది.కానీ శివుడు దయామయుడు.అందుకే" వీడు నిజమైన భక్తుడు! " అని అనుగ్రహించాడు. అలా వృత్రాసురుడు యజ్ఞకుండంలోంచి బైట కొచ్చి ఇంద్రాద్రి దేవతల పీచం అణిచాడు."నాశరీరం నారాయణ సేవ చేయాలి" అనే సంకల్పంతో ఉన్న వాడు.అందుకే వజ్రాయుధంతో ఇంద్రుడు  ముందుగా అతని రెండు చేతులు నరికేశాడు.కానీ ఆరాక్షసుడు నోరు బాగా తెరిచి ఐరావతంతో సహా ఇంద్రుని మింగేస్తాడు. కానీ నారాయణ కవచం పఠనంతో వైష్ణవ విద్యచేత వాడి పొట్ట లోంచి బైట పడిన ఇంద్రుడుఒక ఏడాదిపాటు వృత్రాసురుని కంఠంని వజ్రాయుధంతో చుట్టూ కోస్తూ  ఆఖరికి నరికి చంపాడు. 
ఆరోజుల్లో రాక్షసులు గొప్ప గా నిష్ఠగా  తపస్సుచేసి బ్రహ్మ చేత వరాలు పొందారు.కానీ ఏంలాభం? సదాలోకాల్ని మునులు దేవతలని ఏడ్పించుకు కాల్చుకు తిన్నారు.
మరి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాంకదా? అధికార గర్వం అహంకార మదంతో ఉన్నతాధికారులు చేసే అకృత్యాలు? ఐనా నోరెత్తలేని నిస్సహాయులం! 🌹
కామెంట్‌లు