పుస్తక నేస్తం!:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
అక్షరాలు నేర్చుకో
పుస్తకాలు చదువుకో
తలరాతలు మార్చుకొని
జీవితాన్ని మలచుకో!

నిన్ను నీవు చూసుకో
లోపాలను దిద్దుకో
మెరుగైన సేవలతో
గుండెల్లో నిలిచిపో

వ్యక్తిత్వం పెంచుకో
పదిమందికి పంచుకో
సద్గుణాలతో మహిని
చుక్కలాగ వెలిగిపో

విలువైనది పుస్తకము
వెలిగించును మస్తకము
మనసారగ నమ్మితే
చక్కబడును జీవితము

పుస్తకం నిజ నేస్తము
తలపెట్టదోయ్! ద్రోహము
మిత్రునిలా చేరదీసి
పంచును ప్రేమాతృతము


కామెంట్‌లు