నీవూ...నేనూ..:- సాधNa- సాధన.తేరాల,ఖమ్మం.
కన్నీటితో రాసుకుంటున్న రాత నాది.....
నా కన్నీటిలో కలగా కరిగిపోయిన జీవితం నీది.

కాలాన్ని ఎదుర్కోలేక పారిపోయిన ఒక ప్రశ్నవి నువ్వు.
కాలం అడిగే ఎన్నో ప్రశ్నలకు
సమాధానాలు లేక ఆగిపోయిన గొంతును నేను.

ప్రేమలో నటన నీది...
ప్రేమతో నరకం నాది.

వేడుకలలో ఒకరి గా నువ్వు
వేదన లో ఒక్కదానిగా నేను

బాధ్యతలు వదిలివేసిన నీవు
బంధాలలో చిక్కుకున్న నేను

నాలా ప్రేమించటం నేర్పించాను...నీకు
నీలా మర్చిపోవటం నేర్పలేదే ...

..నాకు
_______

కామెంట్‌లు