కొత్తూరు రచయితల వేదిక సమావేశం 26న

  కొత్తూరు రచయితల వేదిక రెండోనెల సమావేశం ఈనెల 26వ తేదీన సోమవారం ఉదయం నిర్వహించనున్నట్లు వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు తెలిపారు. కొత్తూరు మండల కేంద్రంలో గల విజ్ఞాన భారతి పాఠశాల ఆవరణలో ఉదయం 8.30 కి కార్యక్రమం ప్రారంభమగునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త పొట్నూరు కోటిబాబు విచ్చేయనున్నారని తిరుమలరావు తెలిపారు. వారి సమక్షంలో కవి సమ్మేళనం, వారి చేతులమీదుగా కవులకు సన్మానాలు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం ప్రతిభావంతులుగా ఎంపికైన ఆరుగురు బాలురకు, ఆరుగురు బాలికలకు పన్నెండు కాపీ బుక్స్ ని కొరవే సభ్యులు, ప్రముఖ రచయిత ముదిల శంకరరావు బహూకరించి ప్రోత్సహించనున్నట్లు తిరుమలరావు తెలిపారు. 
కార్యక్రమంలో సభాధ్యక్షులు కుదమ తిరుమలరావు, ముఖ్య అతిథి పొట్నూరు కోటిబాబులతో పాటు సభ్యులు ముదిల శంకరరావు, అమ్మల కామేశ్వరి, మావుడూరు మురళీకృష్ణ, డా.యెన్ను అప్పలనాయుడు, కలమట శ్రీరాములు, గేదెల మన్మధరావు, పెదకోట ధనుంజయరావు,  ఎ.వి.ఆర్.ఎం.దిలీప్ రాజా పట్నాయక్, బూరాడ గణేష్, పల్ల నారాయణరావు, గడసాపు ఉషారాణి, కలమట గోవిందరావు, ఉర్జాన ప్రసాదరావు, బూడిద సంతోష్ కుమార్, గూనాపు శార్వాణి, శెట్టి భానోజీరావు, గణపతి, దుక్క గణపతిరావు,  వలురౌతు ప్రసాదరావు తదితర కవిమిత్రులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
కామెంట్‌లు