సాహితీ కవి కళాసమితిసాహితీ కెరటాలు===============ఉదయంతో అరుదెంచే అతిధి...జీవకోటికి అది జీవనిధి...ప్రగతి పురోగమనానికి ఇంధనం!సూర్యోదయంతో వచ్చు సుప్రభాతం...ప్రకృతి పరవశానికి కీలకం...జన చైతన్య కారకం!ప్రభాతవేళ పక్షుల కిలకిలారావాలు...పసిపిల్లల మోమున చిరునవ్వులు...సకలజనుల మదిలో మనోవీచికలు!ఉషోదయపు ఉషా కిరణాలు...జీవన గమనానికి మార్గాలు...ప్రగతి రధానికి చక్రాలు!జీవుల మనుగడకు మూలం...ప్రకృతి సౌందర్య కారకం...ఆరోగ్య సంరక్షణకు ఆవశ్యకం!జగతికి ఒకటే ఉదయం...జనులకు ఒకటే హృదయం...సుప్రభాతమే చైతన్య ప్రబోధ గీతం!
ప్రభాతం:- డా. ఆళ్ళ నాగేశ్వరరావు ( కమల శ్రీ ) తెనాలి -7416638823
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి