విరహ నివేదన :-:డా. ఆళ్ళ నాగేశ్వరరావు -కమల శ్రీ -తెనాలి-7416638823
 సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు 
==============
ప్రేయసి ప్రేమికుల మద్య చొరబడి.../
ఇద్దరి హృదయాలలో విరహాగ్నిని రగిల్చి.../
నారదుడిలా వినోదాన్ని తిలకిస్తాను!
భగ్న ప్రేమికులకు సింహ స్వప్నంనై మిగుల్తాను!!
మాసాలలో కెల్లా నాకు ఇష్టమైనది ఆషాడం../
అదే కొత్త దంపతులను వేరు చేసి.../
వారిని విరహ వేదనకు గురి చేసి.../
వారిని మనో వేదనకు గురిచేస్తాను!
తాత్కాలికంగా వేరు చేసినను.../
నేనూ మంచే చేస్తాను!
మనుష్యుల మద్య దూరం పెరిగే కొద్దీ.../
మనస్సుల మద్య ప్రేమబంధం మరంత బలపడుతుంది!
ఆప్యాయతానురాగాలు మునుపటి కన్నా బలియమౌతాయి!
భగ్న ప్రేమికులకు,
విడిపోయిన నవ దంపతులకు.../
 నా నివేదన ఒక్కటే!
ఎడబాటు కొద్దిపాటే 
దానిని తట్టుకోలేక దారి తప్పోద్దు!
అక్రమ సంబంధాలకు బానిసలుగా మారక.../
సక్రమంగా సంసారాన్ని కొన సాగించండి!
ప్రేమికులూ ఓర్పు, సహనంతో వ్యవహారిస్తూ.../
పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదించమని ప్రభోదించడమే 
 నా నివేదన!!!
*********

కామెంట్‌లు