*ఆటలు* :- ఎం. వెంకట సుప్రజ, 8 వ తరగతి,-జ.ప.ఉ. పా. నర్సింహుల పల్లి,-పెద్దపల్లి జిల్లా.
 ఆటలు బాగ ఆడాలి
ఆరోగ్యమునే పొందాలి
ఆలోచనను  పెంచె
చదరంగం ఆట ఆడాలి
కాళ్లకు పనిచెప్పె
పరుగు పందెం ఆట ఆడాలి
చేతులకు పనిచెప్పె
షటిల్ ఆట ఆడాలి
ఏకాగ్రతనుపెంచె
క్యారంబోర్డు ఆట ఆడాలి 
కోతిలాగ దునికె
కోతికొమ్మచ్చి ఆట ఆడాలి
తప్పించుకు తిరిగె
ఖో ఖో ఆట ఆడాలి
 దేశానికి పేరు తెచ్చేలా
 క్రికెట్ ఆట ఆడాలి 
అన్ని ఆటలు ఆడాలి
ఆరోగ్యాన్ని  పొందాలి..

కామెంట్‌లు