ప్రతిరోజు చెమటోడ్చి
సుఖాన్ని దూరం చేసుకుని ,
కష్టాన్ని స్వాగతించి
రాత్రింబవళ్లు విశ్రమించక శ్రమించి
ప్రజల కడుపు నింపడం గురించి
వారు ఆకలితో అలమటించి
దేశ సుఖం కొరకు ఆలోచించి
వారు దుఃఖాలను అనుభవించి
మనకుసంతోషాన్ని ఇచ్చి
తన చిరునవ్వును మరచి
హలాన్ని మిత్రుడిగా భావించి
పైరు పంటలని ఆస్తిగా గ్రహించి
మట్టిలో ముత్యాలు పండించి
ప్రతి పరిస్థితిని ఒకే రీతిగా స్వీకరించి
ఈ నేలకే తన సర్వస్వాన్ని అర్పించి
పని ఉన్న లేకున్నా ఉదయాన్నే లేచి
కారమన్నానైనా కండ్ల కదు కొని భుజించి
పంటలెన్నో పండించి
ప్రాణికోటికి ఆకలి తీర్చే
ఓ రైతన్న నీకుఇవే
శతకోటి వందనాలు
జై జవాన్! జై కిసాన్!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి