1.రుద్రాంశసంభూతా,
వానరశ్రేష్టా,రామభక్తాగ్రేసరా,
కాలాన చిరంజీవా!
అంజనాదేవి తపోఫలమా, కేసరి సరి సుత జననమా!
బాలభానుడు ఫలభ్రమ, అందుకున్న సంభ్రమ గరిమ!
విపరీత దుడుకుతనం, ప్రతిఫలం మునుల శాపం!
వజ్రఘాతం తిన్నదేహం, హనుమగా లోక విఖ్యాతం!
2. సూర్యుడే నిజ గురువు,
నేర్చిన విద్య కల్పతరువు!
నవవ్యాకరణ పాండిత్యం,
జ్ఞానానమేటి ఆధిపత్యం!
దుష్టుల కాలరాచే కాలుడు,
శిష్టుల బ్రోచే నిజ దేవుడు!
సుగ్రీవ మంత్రిగా మంత్రాంగం, రామునిచే పండిత సత్కారం!
3.రామసుగ్రీవ మైత్రి మూలం, రామబంటే ప్రియనామం!
సుందరకాండసుందరరూపం,
రామాయణమహామాలరత్నం!
శతయోజన సాగరలాంఘనం,
లంక, సీతాన్వేషణ సఫలం!
అశోకవనాన అమ్మ దర్శనం, ఆమెకు రామకథ శ్రవణం!రామముద్రిక అమ్మకివ్వడం,
చింతామణి అందుకోవడం!
4. అశోకవనం బీభత్సం,
వేల అసురుల ఘోర సంహారం!
రావణ ఆగ్రహం, మేఘనాధ, ఆగమనం,బ్రహ్మాస్త్ర ప్రయోగం!
బంధానికి బందీ, రావణ, దర్శనఆర్తి ,హితబోధన స్ఫూర్తి!
వాలమునకు నిప్పు శిక్ష, బంగారు లంకకు అగ్నిపరీక్ష!
రామపరాక్రమం ,రుచిచూపిన, మారుతి సరి రామదూత!
5. సోదర నాగబంధ ఛేదనం,
లక్ష్మణమూర్ఛ మాయం!
రావణసంహారం ,రామగమనం,
భరతునికందించే సమాచారం!
యుగాల నుండి వస్తూ, గ్రామ, గ్రామాన కొలువై ఉన్నాడు!
అష్టసిద్ధులను, నవనిధులను, మనకు అనుగ్రహిస్తున్నాడు!
స్మరణతో జీవనరాగం సావేరి, దీవెనతో బతుకున జయభేరి!
_________
ఈరోజు,
రామభక్తాగ్రేశ్వరుడు
హనుమజ్జయంతి,
హనుమస్మరణం,భవతరణం.
జై శ్రీరామ్, జై హనుమాన్!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి