వసుధైక కుటుంబం.:-డా.పివిఎల్ సుబ్బారావు,-9442059797.
నా పంచపదుల సంఖ్య---

1280.
కుటుంబం రక్త సంబంధీకులు, ఒకటైన  సమూహము!

కలసి మెలిసి కష్టసుఖాలు, పంచుకునే సూత్రము! 

ఒకరి కోసం అందరూ ,
అందరూ ఒక మాట కోసము! 

కుటుంబం సమాజ మూలము,
అది నిర్మించేదే సమాజము!

కుటుంబ గౌరవం, కుటుంబ, సభ్యుల ఆరవ ప్రాణము, పివిఎల్! 

1281.
ఉమ్మడి కుటుంబం,
      ఆదర్శ కుటుంబం ,
          వ్యక్తి కవచము! 

ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ, బీటలు పడే సమయము! 

తమమాటి చెల్లాలన్న ,
సభ్యుల నేటి దృష్టి కోణము!

పిల్లలు వసతి గృహాలు పెద్దలకు వృద్ధాశ్రమము! 

నేడున్నకుటుంబం సంకుచితం, ఇద్దరే భార్యాభర్తలే, పివిఎల్!

1282.
కుటుంబం శాంతి నివాసం, వ్యక్తిత్వ వికాస ఆలంబన! 

పెరిగే పిల్లలు, పెద్దల బోధన, అఖండ దీవెన! 

కలసి ఉంటే కలదు సుఖం, సరిజీవన యోజన! 

విశ్వమంతా ఒకే కుటుంబం భారత విశాల భావన! 

కుటుంబం వ్యక్తి భద్ర దుర్గం, మరి జీవితం నిత్యం క్షేమం పివిఎల్! 
________


కామెంట్‌లు