:: మాతృ దేవో భవ ::- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు-సారవకోట చరవాణి: 9490904976

మాతృ దినోత్సవ సందర్భంగా..
భగవంతునికైనా,
భాగ్యవంతునికైనా, బీదకైనా
బిడ్డకు జన్మనిచ్చి
బ్రతుకునిచ్చేది, బ్రతకనిచ్చేది అమ్మ.
భారమైన, బాధైన మోసి భరించేది అమ్మ.
అనంత విశ్వంలో అపురూపమైనది,
అనురాగమయి అమ్మ.
అమ్మ పిలుపు అమృతం.
అమ్మను పిలవని నోరు మృతం.
అల్లారుముద్దుగా పెంచేది అమ్మ.
అమ్మలా లాలన పాలన చూసేది,
అవనిపై ఇంకొకరుండరు.
అమ్మ ఇంటి దీపం..
అమ్మ మన కంటి రూపం.
అమ్మ ఏనాడూ పెట్టదు శాపం.
అమ్మపై చూపకు నీ కోపం.
అమ్మకు కన్నీరు తెప్పించకు.
అమ్మ మనసు నొప్పించకు.
అమ్మ నాన్నలను ఏనాడూ విడవకు.
అనాథలనుచేసి వృద్ధాశ్రమాల్లో వదలకు. 
అమ్మ కని పెంచే దైవం, కనిపించే దైవం.

కామెంట్‌లు