మతం పేరుతో మనుషుల్ని చంపుతారా!
మతం కన్నా మానవత్వం మిన్న అనే కదా
ఏమత గ్రంథమైన ఉద్భోదించింది.
ఎవరిపై ఎవరు ఆధిపత్యం సంపాదించాలని
ఈ కవ్వింపు చర్యలకు పూనుకుంటున్నారు .
అసలేం జరిగిందో ..
ఎందుకు ఇలా జరుగుతుందో ...
తెలియని అమాయక ప్రజలను
మట్టుబెడుతున్నారు.
ఓరి ఉన్మాది
ఓరి మతోన్మాద సైతాన్
మనుషులను ప్రేమించడం మరచిన
కిరాతకుడా!
నైతిక మానవ విలువలు ఏకోశానకూడా లేని నిర్ధయుడా!
నీ జన్మ
నీ మరణం
లోకకళ్యాణాకే నన్న
సోయిమరచిన
క్రూరజంతువుకన్న
ప్రమాదకారి!
ఇలా ఒకరినొకరు
ఒకరిపై మరొకరు
పై చేయి సాధిస్తూ..
ముందుకెళ్ళి
నువ్వు సాధించేమిరా?!
నీకు మరణం లేదా!
ఎవడి ప్రసన్నత కోసం
ఈ మారణహోమం ...
ఏం సాధించాలని...
ఈ విధ్వంసం...
బుద్ధి జీవులు మానవులు..
ఏంటీ బుద్ధిహీనపుపనులు..
దేశాల దేశాలమధ్య శాంతి సౌభాగ్యం
ఎగుమతి దిగుమతులు
నిరంతరాయంగా దౌత్య సంబంధాలు
నూతనత్వాన్ని
పరాయి దేశాల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అడాప్ట్ చేసుకోవడం
వీటి మూలంగానే కదా శాంతి సుహృద్భావం పరిఢవిల్లేది
ఆయా దేశాలు తమ స్వదేశీ పరిజ్ఞానంతో
ప్రపంచ యవనికపై మన ప్రతిభాపాటవాలను
చాటడం ...
ఇలా ఆయా దేశాలు
ఆరోగ్యవంతమైన పోటీకనబరచి
తమ(న) దేశ ఘనతను దశదిశలా పరివ్యాప్తం చేయాలి
కానీ
మనిషి మనిషి చంపుకోవడం
ఇదంతా రాక్షస ప్రవృత్తి
ఈ వైఖరి మానుకుందాం
మనుషులుగా మసలుకుందాం
మానవత్వం చూపడానికి
కులంమతంవర్ణంవర్గంఅనే
భేదభావాలు
అసలే లేవు
అందుకే
ప్రపంచ శాంతి కోరుకుందాం
మనమధ్య సౌభ్రాతృత్వం పెంపొందించుకుందాం
ప్రపంచ శాంతి వర్థిల్లాలి ( సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి) :- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి