మనలో మంచి ప్రవర్తన తెచ్చుకోవాలి. మంచి మనుషులుగా బతకాలి. మంచి పేరు తెచ్చుకోవాలి.అందరితో కల్సి మెల్సి ఉండాలి. అందరితో ఆనందాన్ని పంచుకోవాలి. తప్పులు చేయొద్దు. చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. తప్పులు చేయని వారు ఎవరైనా ఉన్నారా? లోపం లేనివారు ఎవరైనా ఉన్నారా. అంటే లేరు. లేరు. లేరు అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఆవేశం లో, కోపంలో, మత్తులో ప్రేమ మైకంలో ఇలా ఎన్నో తప్పులు ఏదో ఒక తప్పు చేయని వారు ఉండరు. తెలిసినప్పుడు మనకు విచక్షణా జ్ఞానం కలిగినప్పుడు, ఏది మంచి ఏది చెడు, ఏది పాపం అని తెల్సుకుని భగవంతుని క్షమాపణ కోరాలి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మళ్ళీ ఇలాంటి తప్పులు, ఏ తప్పులైనా నేను చేయను స్వామి అని పరమాత్మను వేడుకోవాలి. మళ్ళీ చేయకుండా ఉండాలి.చేసిన వారిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి.చాలా మంది చాలా కాలం నుండి అశ్లీల చిత్రాలు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చుస్తూ తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మానసిక రోగులుగా మిగిలి పోతున్నారు. పిచ్చి వాళ్ళలా రోడ్లపై తిరుగు తున్నారు. ప్రేమ, వ్యామొహం తెలుసుకోలేక క్రూరత్వంతో తమ జీవితాన్ని ఇతరుల జీవితాల్ని సర్వ నాశనం చేసుకుంటున్నారు. ఆరాచకాలు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ కుటుంబాన్ని దేశాన్ని బ్రష్టు పట్టిస్తూన్నారు.ఇది మానండి.మీలో మంచి మార్పు తెచ్చుకోండి.మీరు మంచివారుగా మారాలి అంటే తప్పకుండ మారుతారు.ముందు నాలో మంచి మార్పు రావాలి అనిసంకల్పంచేసుకోండి.తప్పకుండా వస్తుంది. ఐస్ క్రీం తింటే గొంతు దెబ్బ తింటుంది అని మనం అనుకుంటే ఇక దాని జోలికి పోము. ఔనా.
మంచివారుగా మారుదాం!! :- మిత్రాజీ(గుండవరం ప్రభాకర్ రావు )-. 9949267638-అత్వెల్లి 'మేడ్చల్ జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి