అమ్మమాట:- పి.అవినాష్-9వ,తరగతి-జి.ప.ఉ.పా రామంచ-మం:చిన్న కోడూరు-జి:సిద్దిపేట
 రామాపురం అనే  గ్రామంలో శేషు తన తల్లితో కలిసి నివసించేవాడు. శేషు తొందవ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.శేషుకు చదువుపై నిరాశ ఉండేది , ఆటలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు శేషు వాళ్లకు కొంత జాగా కూడా ఉండేది.ఒక రోజు ఒక పని మీద శేషు వేరే గ్రామానికి వెళ్తున్నప్పుడు శేషు వాళ్ళ జాగలో స్నేహితులు ఫుడ్భాల్ ఆడుతుండగా శేషు చూసాడు. ఊరునుండి ఇంటికి వచ్చాక శేషు ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళాడు. అలా ప్రతిరోజు వెళ్లేవాడు, రాత్రంతా నిద్రలో కూడా ఫుట్బాల్ అంటూ కలవరిస్తూ పడుకున్నాడు. కొడుకును చూసి అమ్మకు జాలి వేసింది. ఉదయం అమ్మా స్నేహితులతో మీరు మా జాగాలో ఆడుతున్నారు మీరు ఆడాలంటే మా శేషును ఆడిపించుకోకూడదు అని గట్టిగా  చెప్పింది.మరునాడు శేషు ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళాడు, కానీ శేషు ను ఆడిపించుకోలేదు. అప్పుడు బాధతో ఇంటికి వచ్చి అమ్మతో చెప్పాడు ,అమ్మా నన్ను నా స్నేహితులు ఫుట్బాల్ ఆడిపించుకోవడం లేదు అని చెప్పాడు.శేషు నువ్వు చాలా బాగా చదువుకొని గొప్పవాడివి కావాలి ఆటలమీద దృష్టి పెడితే చదువలేకపోతున్నావు అని చెప్పింది.అమ్మ మాటలు  అర్థం చేసుకుని నిరంతరంకష్టపడి చదువుకొని ఉన్నత చదువులు పూర్తి చేసిన కొంతకాలం తర్వాత శేషు టీచర్ జాబ్ తెచ్చుకున్నాడు.వాళ్ళ అమ్మ కొడుకు పేరు గర్వంగా చెప్పుకునేవిదంగా పని చేశాడు.తాను చదువుకున్న బడిలో టీచర్ గా పనిచేస్తూ,పిల్లలకు ఎరికైతే ఆటలపై ఇష్టం ఉన్నదో తెలుసుకొని వారికి చదువుతో పాటు, ఆటలలో ప్రోత్సాహించి ,అనేక సహాయ సహకారాలు అందిస్తు‌‌,  అమ్మకు సాయం చేస్తూ సంతోషంగా జీవితం గడుపుతున్నారు.

కామెంట్‌లు