నీదే బాధ్యత :- లలితా చండి- హైదరాబాదు
సాహితీ కవీకళాపీఠం
సాహితీ కెరటాలు 
===============
నాణేనికి ఇరువైపుల  వున్న బొమ్మా బొరుసుల్లా  భాధ్యత,హక్కులు 
మనిషికి సహజ లక్షణాలని మరవకుమా!  
హక్కుల పరి రక్షణకు  న్యాయస్థానాలలో గొడుగెత్తినట్లు 
 భాధ్యతల ఉల్లంఘనలకు శిక్షలు  వెనక బడ్డాయి
భీమా సంస్థలు  మాత్రం  తూ.చ.తప్పకుండా  పాటిస్తున్నాయి తెలుసా!
 
పరుగుల లోకంలో నిలబడి నీరు త్రాగుటే మేలు
 మెరుపులు  కాసేపే చీకటి వెలుగులు సహజం  అంటూ  యువతకు వివరిస్తూ
యధార్ధమెరిగి భవితకు మార్గదర్శకం తెలిపే భాధ్యత మనదే సుమా!

కామెంట్‌లు