జీవితం ఓ లెక్క:- - యామిజాల జగదీశ్
 ఒకానొక ఆస్పత్రి ఐసీయు వార్డులో డాక్టరుకీ, యమదూతకూ మధ్య ఓ రోగి గురించి తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది.
యమదూత "రోగి జీవితకాలపు లెక్క ముగిసింది. కనుక అతనిని నాతో పంపించు" అన్నాడు డాక్టరుతో. 
అయితే డాక్టరు "మా ఆస్పత్రిలో ఈ రోగి చికిత్స చేయించుకోవడానికైన  డబ్బులు ఇంకా కట్టలేదు. ఆ లెక్క ఇంకా మిగిలే ఉంది. అతను ఆ డబ్బులు కట్టెస్తే నీతో అతనిని పంపడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఆ లెక్కేదో తీరేంత వరకూ అతనిని నీ వెంట పంపే ప్రసక్తే లేదు" అన్నాడు గట్టిగా.
ఈ గొడవంతా చూస్తేనే ఉన్న రోగి దేవుడితో "జీవితం అనేది ఓ లెక్క అని మా లెక్కల మాస్టారు ఎంతలా విడమరిచి చెప్పినా ఆ లెక్కల తత్వాన్ని నేనప్పుడు నమ్మలేదు.
కానీ ఇప్పుడు నమ్ముతున్నాను" అన్నాడు.

కామెంట్‌లు