పల్లవి:-
ఎన్ని పూజలు చేసి, ఎన్నిమొక్కులు మొక్కి ,నన్నుగన్నావో నా కన్న తల్లీ...!
ఎన్నెన్ని కష్టాలు, ఎన్నిబాధల కోర్చి , నన్ను పెంచావో... మా అమ్మ నీవు...!!
"ఎన్ని పూజలు చేసి..."
చరణం:-
నన్ను బ్రతికించు కొనగ ఎన్ని రాత్రులు నీవు నిదుర పోలేదో...!
నా కడుపు నింపగ , ఎన్ని పూటలు నీవు పస్తు లున్నావో...!
నన్ను గన్నందుకు... నీ కెన్ని పాట్లమ్మ ...!
" ఎన్ని పూజలు చేసి..."
చరణం :-
నేను ప్రయోజకుడ నైతినని,నిన్ను సుఖ పెడుదు నని... కొండంత ఆశతో నీ దరికి జేరగా...
ఇహమువీడి, నీవు పరము జేరితివా ...!
ఋణము దీర్చుక నీవు వెడలి పోయితి వమ్మ...
మరుజన్మలో నా ఋణ ము దీరగ నీకు అమ్మనై పుట్టెదను....2
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి