రంగ 9వ తరగతి చదువుతున్నారు. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. అతనికి చిన్నప్పటి నుంచీ పోటీ లేదు. 9వ తరగతిలో వాసు అనే కొత్త విద్యార్థి జాయిన్ అయ్యాడు. అతడు చాలా తెలివైన అబ్బాయి. కొద్ది రోజుల్లోనే ఎక్కువ మంది విద్యార్థులకు మంచి స్నేహితుడు అయ్యాడు. వాసు ఖాళీ సమయంలో తాను ఒక్కడే కూర్చుని చదవకుండా, తన చుట్టూ పది మంది విద్యార్థులను కూర్చోబెట్టుకుని వారిని ప్రోత్సహిస్తూ వారితో కలిసి చదివేవాడు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన వారికి, సందేహాలను నివృత్తి చేస్తూ, అర్థం అయ్యేలా చెబుతూ ఎక్కువ మంది తెలివైన విద్యార్థులను తయారు చేశాడు.
ఇది గమనిస్తున్న రంగ మరో 15 మంది విద్యార్థులను కలుపుకొని, "మనమూ కలసి చదువుదాం. ఆ వాసు కంటే మన గ్రూపే పెద్దగా ఉండాలి." అన్నాడు రంగ. ఉపాధ్యాయుల దృష్టిలో తోటి విద్యార్ధులను బాగా ప్రొత్సహిస్తూన్న గొప్ప విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.
"ఎప్పుడూ చదువే కాదురా! మధ్య మధ్యలో ఆటలు కూడా ఉండాలి. అస్సలు ఆటలు లేకుండా ఎప్పుడూ చదువే అంటే పిచ్చివాళ్ళం అవుతాము." అన్నాడు రంగ. రోజూ సాయంత్రం రంగ ఆ 15 మందినీ వెంట తీసుకొని వెళ్ళి, ఊరి బయట క్రికెట్ ఆడేవాడు. రాను రాను ఆ ఆటల సమయం పెరిగింది. ఆదివారాలు, సెలవు రోజుల్లోనూ రంగ ఈ 15 మందితో పూర్తి సమయం క్రికెట్ కోసం కేటాయించేవాడు.
రంగకు చిన్నప్పటి నుంచీ క్రికెట్ పిచ్చి. కొత్తగా వచ్చిన వాసు మరో 10 మంది విద్యార్థులను కూడబెట్టుకొని వారిని చదువులో మరింత తెలివైన వారిని చేస్తున్నాడు కదా! ఈ కారణం చూపి, తానూ 15 మందిని కూడబెట్టుకొని, వాసుకు పోటీగా చదువు మీద ప్రోత్సాహం పేరుతో క్రమంగా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తనకు వినోదం కోసం వారిని బలి చేస్తున్నాడు. రాను రాను ఆ 15 మందీ చదువులో వెనకబడ్డారు.
కాలం గడిచింది. ఇప్పుడు వీరంతా 10వ తరగతి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వాసు మిత్ర బృందం అంతా 550కి పైగా మార్కులు సాధించారు. రంగ మిత్రబృందంలో 10 మంది ఫెయిల్. మరో ఐదుగురు చాలా తక్కువ మార్కులతో పాస్ అయ్యారు. అందరూ ఇంట్లో తల్లిదండ్రులతో చీవాట్లు తిన్నారు. గతంలో ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే రంగ 420 మార్కులే తెచ్చుకున్నాడు. అందుకే మంచి ఎదో, చెడు ఏదో తెలుసుకోవాలి. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి