కడలి కదలిక :- డా. ఒజ్జల శరత్ బాబు
అడుగుముందుకు వేసె చెడుగుడాడుచు వైరి 
             చెత్త యాలోచనల్ చిత్తు జేయ
కాళరాత్రుల నరి కాంచునట్లుగ  బళా 
            యంచు లోకపు మోము నెంచురీతి 
చంపకుండగ వాడె చచ్చునట్లుగ శత్రు 
           మూకల పాకల నేకి వేయ 
నెట్టి కేళీవ్యూహ మట్టి కదనముతో 
           చిట్ట చివరి వాని మట్టు బెట్ట 

మేన మామనూ వదలని మేటి కృష్ణు 
వోలె, భస్మాసుర శివుని వోలె , రావ 
ణాసురుని పరిమార్చిన నైష్ఠికుడగు 
ధర్మ మూర్తి రాముని వోలె దారి గనుచు 

సహనము నశించినప్పుడు 
సహచర భావమడుగంటు సమరము గతియౌ 
అహమున్న నీచు పీకను 
కుహనా బుద్ధుల నణచుడె ఘోరీ గట్టన్  

కడలికేవిసుగు గలిగి యాడ మనుచు 
నంపెను కరాచి శుద్ధత నట్లు జేయ 
ధర్మ మార్గము నడిపించు తననె  కోప 
నంత జేసితిరేమిటి ట్లదురు టేల !
       

కామెంట్‌లు