సైనికుల వీరత్వం :- కె. రాజేష్ -జోగులాంబ గద్వాల
 సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
===============
జమ్మూకాశ్మీర్ లోని అందాలను 
ఆహ్లాదకరమైన వాతావరణంను 
చూసి ఆనందించాలని 
పర్యాటకులు విహారిస్తుంటే 
మనవడా కదా అని చూసి 
కనికరం చూపకుండా హెచ్చరించి 
కాల్చిరి మతోన్మాదా ఉగ్రవాదులు 
యావత్ ప్రపంచం ఉలికిపడిరి 
కన్నీటిమయమయ్యే  భారతదేశం 
ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి 
దాడిచేసిరి ఉగ్రవాద స్థావారపై 
మట్టు పెట్టీరి ఉగ్రవాదులను 
ద్వంసం చేసిరి స్థావరాలను 
సైనిక వీరత్వం చూపిరి 
ఇద్దరు మహిళా మణుల
నేతృత్వంలో 
దేశమంతా ఏకమైరి 
కులం మతం తేడాలేకుండా 
పోరాడిన సైనికులకు 
అమరవీరులైన సైనికులకు 
వందనాలు మరువం 
వారి త్యాగలను 

కామెంట్‌లు