కోయిలమ్మ ప్రబోధం: - --బాలబంధు డా.గద్వాల సోమన్న.
ఎగిరెగిరి వచ్చింది
చెట్టుపై వాలింది
గొంతెత్తి కోయిలమ్మ
 కమ్మగా కూసింది

రంగు చూడ నల్లన
గొంతేమో తీయన
ఆనందం నింపును
ఆలకిస్తే మనసున

పిల్లల పలుకుల్లా
కోయిలమ్మ రాగాలు
రంజింపజేయునోయ్!
విన్నవారి హృదయాలు

వద్దు వద్దు భేదము
అనైక్యతకు మార్గము
చెప్పింది కోయిలమ్మ
అమూల్యమైన సత్యము 

ప్రతిభే కొలమానము
తెచ్చునది గౌరవము
రంగు కంటే గుణము
బహు శ్రేష్టం అన్నది

కోయిలమ్మ ప్రబోధము
అందరికి ఆమోదము
పాటిస్తే మాత్రము
కొండంత ప్రమోదము


కామెంట్‌లు