ఎన్నడు చూడని శిఖరాలు
ఎంతకూ అందని గగనాలు
ఎత్తున వేలాడే ఆశలు
ఎప్పటికైనా తీరేనా?
ఏటిని మించిన వేగాలు
ఏపుగ పెరిగిన కోరికలు
ఏ తీరుగ చేతికందునో
ఏ వేళకు మనసు నిండునో!
ఒంటరి పయనమే జీవితం
ఒకటే దొరికే మధుర ఫలం
ఒడుపుగ నడిపితే నావను
ఒడ్డుకు చేరదా ఒద్దికగా!
ఓపని కలతలు కమ్మినా
ఓర్వని శక్తులు విషం చిమ్మినా
ఓర్పుగ నమ్మి పిలువగా
ఓయని దైవం పలుకదా?
ఐకమత్యముగ అనుసరించుకుని
ఐదుభూతములు కాపాడగా
ఔషధముగ మంచితనము కూడిన
ఔన్నత్యముగ మనుగడ సాగదా?
అంతా తానై అన్నిటా నిండి
అందరికీ అన్నివేళలా తోడైన
అంతర్యామి ఆదిత్యునికి
అంతరంగమున అంజలి ఘటిస్తూ
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి