: విజయం :- :కె.కె.తాయారు-మదనపల్లి
సాహితీ కవి కళా సమితి 
 సాహితీ కెరటాలు 
===============
అలలపై పడవ ప్రయాణం 
ఆశలతో అంతులేని ఆవేశం 
ఉద్వేగం లో ఉరకలెత్తు భావావేశం 

కంఠంలో కోకిల మార్ధవం. 
గళంలో శివయ్య ఓంకారం 
డమరుకం లో మృదంగా విన్యాసం 

భవితకు భాష్యాలు చెప్పు 
బంగారు బాటలు వేయు
భాగ్యాలు అమోఘంగా పండించు 

నిండు నూరేళ్లు మాట 
నిచ్చెన వేయకుండా దీవెన 
నిజము ఎరిగి ఎదుగు 

కష్టాలు సర్వులకు సాధారణం 
కడు గడుసరి బుద్ధి 
కార్యసాధనే నీకు జయం 

పట్టు వదలకు ప్రయత్నం 
పరమార్థిక తోడు పయనం 
వట్టు నడి రాత్రే సూర్యోదయం


కామెంట్‌లు