అల్లిక:- - యామిజాల జగదీశ్
 1918లో నడుస్తున్నప్పుడు అల్లడం అనేది ఒక సర్వ సాధారణ దృశ్యం. ముఖ్యంగా వారి దైనందిన దినచర్యలలో బహుళ పనులు చేయడానికి సృజనాత్మక మార్గాలను కనుగొన్న మహిళలు ఎందరో లెక్కే లేదు. వారు పనికి వెళ్ళేటప్పుడు, వంట పనులు చేస్తున్నప్పుడు లేదా వాకింగుకి వెళుతున్నప్పుడు,  వారు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకునేవారు.
ఆధునిక జీవితంలోని అంతరాయాలకు చాలా కాలం ముందరి చిత్రమది.
యుద్ధ సమయంలో అల్లడం చాలా ముఖ్యమైనదిగా భావించారు నాటి మహిళలు. సమయాన్ని అర్థవంతంగా మార్చుకోవాలన్నది వారి ఆశయం.  మొదటి ప్రపంచ యుద్ధం హోరాహోరీగా జరుగుతున్న రోజులవి. అప్పుడు మహిళలు సైనికులకు సాక్స్, స్కార్ఫ్‌లు, ఇతర దుస్తులను అల్లారు. అనిశ్చిత సమయాల్లో వారికి మహిళలు తమ వంతు సహాయసహకారాలు అందించారు. సంఘీభావం ప్రకటించారు. వారి సంకల్పం సమిష్టి స్ఫూర్తిని బలోపేతం చేసింది.
నడుస్తున్నప్పుడు అల్లడం ఆనే సామర్థ్యం కూడా అద్భుతమైన నైపుణ్యమే. ఇది వారి సామర్థ్యానికి నిజమైన ప్రదర్శన. ఇక్కడ రోజువారీ పనుల ఒత్తిడి మాటెలా ఉన్నా సైనికులకు తమ సహాయ సహకారాలను ఏదో ఒక రూపంలో అందించడమే తమ బాధ్యతగా భావించారు.  

కామెంట్‌లు