సుప్రభాత కవిత : - బృంద
గూడుకట్టుకున్న  దిగులు 
రూపు దిద్దుకున్న భయాలు 
పటాపంచలు  కాగా 
ఒక్కటే ధ్యేయంగా సాగాలి!

ఉలిదెబ్బలు తప్పవు
శిల శిల్పమవడానికి
కల కాదు నిజమిది
కఠిన కాలం నెగ్గి తీరాలి!

సహకారం ఇవ్వాలి
సంయమనం చూపాలి
సంకష్ట సమయాన
సర్వులూ ఏకమవాలి!

కదనరంగాన  విజయానికై 
కసిగా ఎదురెళ్ళు పాదాలకు
కనిపించే శత్రువు తప్ప 
కష్టాలు కంటకాలు తెలియవు

నడిపించు శక్తికి వందనాలు
నడిచే వారికై ప్రార్థనలు
నీమముగా  చేసే పూజలు
నిలుపును వారి  శౌర్యాలు!

మన క్షేమము కోరి 
తమ కుటుంబములు వీడి 
శ్రమించు సైనికులకు 
పాదాభివందనములతో...

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు