విద్య నేర్వనోడు వింత పశువు
నేర్చినోడు వివేకియై వెలుగు!
విద్యతోనే అజ్ఞానం తొలుగు
విజయాలు నీ ధరి చేరును!
పంచేకొద్దీ తరిగేది ధనం
నేర్చేకొద్దీ పెరిగేది జ్ఞానం
జ్ఞానంతో కలుగును వినయం
వినయమే విజయాలకు కీలకం!
విద్య నేర్చేందుకు అడ్డు రాదు వయోభేదం
విద్యకు లేదు అంతం
అది సాగరం లా అనంతం
చదివే కొద్దీ ఇంకా మిగులును
విద్యతోనే అజ్ఞానపు చీకట్లు
తొలుగును
చదువే సమస్యలకు పరిష్కారం చూపును
మున్ముందుకు నడిపించును
మార్గదర్శిగా నిన్ను నిలుపును!
అందరూ విద్య నేర్వాలి
వివేకవంతులై మెలగాలి!!!
*********
డా. ఆళ్ళ నాగేశ్వరరావు( కమల శ్రీ)
కవి... రచయిత... ఆర్టీసీ కండక్టర్
తెనాలి... 522201
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
చరవాణి:7416638823
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి